రాచకొండలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌ను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేరేడ్మెట్, కుషాయిగూడ, జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు కిలోమీటర్ల వరకూ మార్చ్ జరిగింది. ఈ మార్చ్ లో టీఎస్ఎస్‌‌పీ ప్లాటూన్లు, సిటీ ఆర్డ్మ్ రిజర్వ్, […]

Update: 2020-11-24 12:01 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌ను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేరేడ్మెట్, కుషాయిగూడ, జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు కిలోమీటర్ల వరకూ మార్చ్ జరిగింది. ఈ మార్చ్ లో టీఎస్ఎస్‌‌పీ ప్లాటూన్లు, సిటీ ఆర్డ్మ్ రిజర్వ్, మౌంటెడ్ హార్స్ టీం, కార్ల బ్యాండ్ టీం, లా అండ్ ఆర్డర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో మల్కాజిగిరి డీసీపీ రక్షణమూర్తి, అడిషనల్ డీసీపీ షమీర్, ఏసీపీలు శ్రీను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News