తొలి జీతంతో అనాథ‌ల ఆక‌లి తీర్చింది..

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : పోలీసులు అంటే కఠిన హృదయానికి నిదర్శనంగా భావిస్తుంటారు ప్రజలు. కానీ ఖాకీ యూనిఫామ్ వెనుక మానవత్వం దాగుందని నిరూపించిందో కానిస్టేబుల్. తన మొదటి వేతనం తనకు కాకుండా అభాగ్యులకు చెందాలన్న సంకల్పంతో ఆపన్నుల ఆకలిని తీర్చింది. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా గీసుగొండ పోలీస్‌స్టేష‌న్‌లో అనుషాకు కానిస్టేబుల్‌గా తొలిపోస్టింగ్ వచ్చింది. ఆమె అందుకున్న తొలి జీతంతో అనాథ‌ల‌కు, అభాగ్యుల‌కు ఆహార‌పు పొట్లాల‌ను అందించింది. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన త‌ర్వాత వ‌చ్చిన తొలి వేతనాన్ని […]

Update: 2021-02-12 06:39 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : పోలీసులు అంటే కఠిన హృదయానికి నిదర్శనంగా భావిస్తుంటారు ప్రజలు. కానీ ఖాకీ యూనిఫామ్ వెనుక మానవత్వం దాగుందని నిరూపించిందో కానిస్టేబుల్. తన మొదటి వేతనం తనకు కాకుండా అభాగ్యులకు చెందాలన్న సంకల్పంతో ఆపన్నుల ఆకలిని తీర్చింది.

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా గీసుగొండ పోలీస్‌స్టేష‌న్‌లో అనుషాకు కానిస్టేబుల్‌గా తొలిపోస్టింగ్ వచ్చింది. ఆమె అందుకున్న తొలి జీతంతో అనాథ‌ల‌కు, అభాగ్యుల‌కు ఆహార‌పు పొట్లాల‌ను అందించింది. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన త‌ర్వాత వ‌చ్చిన తొలి వేతనాన్ని ఇలా సేవ కార్య‌క్ర‌మానికి వినియోగించ‌డంపై ప‌లువురు ఆమెను కొనియాడుతున్నారు.

Tags:    

Similar News