మావోయిస్టుల ఏరివేతపై పోలీసుల భారీ స్కెచ్

దిశ ప్రతినిధి, కరీంనగర్: దండకారణ్య ఆటవీ ప్రాంతంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ దృష్టి సారించబోతున్నాయి. బలగాలను మట్టుబెడుతూ సర్కార్‎కు సవాల్ విసురుతున్న మావోల ఏరివేతే లక్ష్యంగా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. దండకారణ్యంలోని పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలో మరిన్ని బేస్ క్యాంపులు వేయాలని భావిస్తున్నాయి. శనివారం ఎదురు కాల్పుల ఘటన జరిగిన జోనాగుడా పరిసర ప్రాంతాల్లో అదనంగా 2 వేల మంది బలగాలను మోహరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. బేస్ క్యాంపులను మరిన్ని పెంచే యోచనలో ఛత్తీస్ […]

Update: 2021-04-04 23:38 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: దండకారణ్య ఆటవీ ప్రాంతంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ దృష్టి సారించబోతున్నాయి. బలగాలను మట్టుబెడుతూ సర్కార్‎కు సవాల్ విసురుతున్న మావోల ఏరివేతే లక్ష్యంగా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. దండకారణ్యంలోని పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలో మరిన్ని బేస్ క్యాంపులు వేయాలని భావిస్తున్నాయి. శనివారం ఎదురు కాల్పుల ఘటన జరిగిన జోనాగుడా పరిసర ప్రాంతాల్లో అదనంగా 2 వేల మంది బలగాలను మోహరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. బేస్ క్యాంపులను మరిన్ని పెంచే యోచనలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉంది.

ఈ ఘటనకు అతి సమీపంలోనే మోస్ట్ వాంటెడ్ మావో నేత హిడ్మా స్వగ్రామం గిహ్రిగావ్ ఉండడంతో ఆయనకు ఆ ప్రాంతంలో తిరుగు లేని పట్టు ఉందని భావిస్తున్న సర్కారు ప్రధాన దృష్టిని ఆ ప్రాంతంపైనే పెట్టింది. ఆ ప్రాంతంలో మావోల ఉనికిని కట్టడి చేస్తే హిడ్మాకు ఏర్పడ్డ బలమైన మూలాలు దెబ్బతింటాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనివల్ల హిడ్మా మెయిన్ షెల్టర్ జోన్ కూడా దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు. అలాగే మావోయిస్టులు ఎక్కువగా దాడులకు పాల్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించి ఆయా చోట్ల భద్రతా చర్యలు తీసుకునే యోచన చేస్తున్నారు.

సోలార్ సీసీ కెమెరాలు

దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోల కదలికలపై నజర్ వేసేందుకు సోలార్ ద్వారా నడిచే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వీటిని వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాల్లోనే చిప్ ఉంటుందని వాటిని అదును చూసి తీసుకొచ్చి ఫుటేజీని పరిశీలించినట్టయితే మావోలపై మరింత పట్టు సాధించే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News