రోడ్డుపై బాలుడిని చితకబాదిన పోలీస్

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు చట్టాలు.. మరోవైపు ప్రభుత్వాలు.. ఇంకోవైపు ఉన్నతాధికారులు బాలులపై ప్రేమ చూపించాలి తప్ప వారిని శిక్షించకూడదని పదేపదే చెబుతున్నా కొందరిలో మార్పు రావడంలేదు. వారి కృరత్వం పసిపిల్లలపై చూపిస్తున్నారు. ఏమీ తెలియని వారంటే ఏమో అనుకోవచ్చు.. కానీ, అన్నీ తెలిసిన అధికారులే ఇలా చేస్తున్నారంటే నోరెల్లబెట్టకతప్పదు. తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజెన్లు లాఠీతో బాలుడిని […]

Update: 2020-08-25 01:00 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు చట్టాలు.. మరోవైపు ప్రభుత్వాలు.. ఇంకోవైపు ఉన్నతాధికారులు బాలులపై ప్రేమ చూపించాలి తప్ప వారిని శిక్షించకూడదని పదేపదే చెబుతున్నా కొందరిలో మార్పు రావడంలేదు. వారి కృరత్వం పసిపిల్లలపై చూపిస్తున్నారు. ఏమీ తెలియని వారంటే ఏమో అనుకోవచ్చు.. కానీ, అన్నీ తెలిసిన అధికారులే ఇలా చేస్తున్నారంటే నోరెల్లబెట్టకతప్పదు. తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజెన్లు లాఠీతో బాలుడిని దారుణంగా కొట్టిన ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని పోస్టులు పెడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ డైరెక్టర్, రచయిత, సింగర్ ఫర్హాన్ అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రోడ్డుపై బాలుడిని చితకబాదిన పోలీస్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీపీని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది. ఢిల్లీలో ఉన్న ఓ ప్రాంతంలో రాత్రి సమయంలో ఓ బాలుడిని ఓ పోలీస్ అధికారి దారుణంగా కొడుతున్న దృశ్యం అందులో కనిపిస్తది. ఆ బాలుడు ఎంత బ్రతిమిలాడినా ఏ మాత్రం కనికరం లేకుండా లాఠీతో తీవ్రంగా కొట్టాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దారుణాన్ని ప్రశ్నిస్తే అతడిపై కూడా ఆ పోలీస్ లాఠీ చార్జ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ పోలీస్ తతంగాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Tags:    

Similar News