తప్పించుకు తిరుగుతున్న నిందితుడి రిమాండ్

దిశ, ముషీరాబాద్: బందువుల ఇంట్లో బంగారం, నగదు అపహరించి తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని గాంధీనగర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ డీఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం….. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉన్న 12వేల రూపాయల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగారం పోయిందనీ ఈ నెల […]

Update: 2020-10-05 11:59 GMT

దిశ, ముషీరాబాద్:
బందువుల ఇంట్లో బంగారం, నగదు అపహరించి తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని గాంధీనగర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ డీఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం….. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉన్న 12వేల రూపాయల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగారం పోయిందనీ ఈ నెల రెండో తేదీన గాంధీనగర్ పోలీసులకు ప్రభాకర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభాకర్ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తారన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు.

కాగా నాగోల్‌లో నివాసం ఉండే మంగళి భాస్కర్ (20) జిమ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకర్ బంధువైన అతను కొంత కాలంగా ప్రభాకర్ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ప్రభాకర్ ఇంటికి వచ్చి వెళ్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులకు భాస్కర్ పై అనుమానం వచ్చింది. దీంతో బండమైసమ్మనగర్ లోని అతని బాబాయ్ ఇంటికి వచ్చిన భాస్కర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బీరువాలోంచి 12వేల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగారం అపహరించినట్లు భాస్కర్
నేరం అంగీకరించాడు. దీంతో అతన్ని రిమాండుకు తరలించారు.

Tags:    

Similar News