టెక్నాలజీని వాడుతూ.. పేకాట ఆడుతున్రు
దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలంలో కరెన్సీ విధానం కాకుండా డిజిటల్ విధానంలో చెల్లింపులు చెల్లించాలని ప్రభుత్వాలు చెప్తున్న సంగతి తెలిసిందే. ఏటీఎం సెంటర్స్ కు వెళ్లడం వలన కరోనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిజిటల్ చెల్లింపులకు ప్రజలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు పక్కదోవ పడుతున్నాయి. పేకాటరాయుళ్ల డిజిటల్ చెల్లింపుల విధానం తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒకప్పుడు డబ్బు దగ్గర పెట్టుకొని పేకాట ఆడేవారు. అలాంటి సమయంలో పోలీసులు రైడ్ […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలంలో కరెన్సీ విధానం కాకుండా డిజిటల్ విధానంలో చెల్లింపులు చెల్లించాలని ప్రభుత్వాలు చెప్తున్న సంగతి తెలిసిందే. ఏటీఎం సెంటర్స్ కు వెళ్లడం వలన కరోనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిజిటల్ చెల్లింపులకు ప్రజలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు పక్కదోవ పడుతున్నాయి. పేకాటరాయుళ్ల డిజిటల్ చెల్లింపుల విధానం తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒకప్పుడు డబ్బు దగ్గర పెట్టుకొని పేకాట ఆడేవారు. అలాంటి సమయంలో పోలీసులు రైడ్ చేస్తే వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు దొరికేది. వాళ్ళు కూడా డిజిటల్ రంగాన్ని ఆశ్రయించడంతో దాడి చేసినా డబ్బు దొరకడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని పొట్టిలంక వద్ద ఉన్న ఓ పౌల్ట్రీ ఫారం షెడ్ లను పేకాట శిబిరాలుగా మార్చుకొని పేకాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో దాడి చేశారు. ఈ దాడిలో 17 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా వీరంతా చెల్లింపులు చెల్లిస్తున్నారట. పేకాట ఆడేందుకు వచ్చే వారి ఫోన్ పే లో కనీసం రూ.50వేలు ఉండాలనే కండీషన్ ఉందట. అంత డబ్బు ఉంటేనే ఆడేందుకు నిర్వాహకులు అనుమతి ఇస్తారని పోలీసులు చెప్తున్నారు.