పాతబస్తీలో విష సర్పాల కలకలం…

దిశ, చార్మినార్ : పాతబస్తీలో బుధవారం సాయంత్రం విష సర్పాల కలకలం రేపింది. పాతబస్తీ భవానీనగర్ మహ్మద్ నగర్ లో ఓ ఇంట్లో రెండు విష సర్పాలు తచ్చాడుతూ కనిపించాయి. గమనించిన స్థానికులు రెండు మూడు గంటలు శ్రమించి తొమ్మిది అడుగుల రెండు విష సర్పాలను పట్టుకొని భవానీనగర్ పోలీసులకు అప్పగించారు. ప్రతి నాలుగురోజులకు ఒకసారి పాములు బయటపడుతున్నాయని సోహైల్ అనే వ్యక్తి వాపోయాడు. చిన్న పిల్లలు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారని పాముల బారినుండి రక్షించాలని […]

Update: 2021-05-26 09:29 GMT

దిశ, చార్మినార్ : పాతబస్తీలో బుధవారం సాయంత్రం విష సర్పాల కలకలం రేపింది. పాతబస్తీ భవానీనగర్ మహ్మద్ నగర్ లో ఓ ఇంట్లో రెండు విష సర్పాలు తచ్చాడుతూ కనిపించాయి. గమనించిన స్థానికులు రెండు మూడు గంటలు శ్రమించి తొమ్మిది అడుగుల రెండు విష సర్పాలను పట్టుకొని భవానీనగర్ పోలీసులకు అప్పగించారు. ప్రతి నాలుగురోజులకు ఒకసారి పాములు బయటపడుతున్నాయని సోహైల్ అనే వ్యక్తి వాపోయాడు. చిన్న పిల్లలు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారని పాముల బారినుండి రక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

మరో సంఘటనలో కొండ చిలువ స్వాధీనం…

హైదరాబాద్ పాతబస్తీ బహదూరపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిరాలం ఈద్గా సమీపం లో ఓ నిర్మాణం లో ఉన్న భవనం లోని నీటి సంపులో 9 అడుగుల కొండ చిలువను స్థానికులు గమనించి స్నేక్ సోసిటీ సభ్యులకు సమాచారం ఇవ్వడం తో సొసైటీ సభ్యులు వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News