నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన సోదరి పూర్వి

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న నీరవ్ మోదీ వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని నీరవ్ మోదీ సోదరి పూర్వి, ఆమె భర్త మయాంక్ మెహతా సంచనలన ఆరోపణలతో ముందుకొచ్చారు. అంతేకాకుండా, నీరవ్ మోదీ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీరి వ్యాఖ్యలతో వేల కోట్ల మోసం చేసి […]

Update: 2021-01-06 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న నీరవ్ మోదీ వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని నీరవ్ మోదీ సోదరి పూర్వి, ఆమె భర్త మయాంక్ మెహతా సంచనలన ఆరోపణలతో ముందుకొచ్చారు. అంతేకాకుండా, నీరవ్ మోదీ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీరి వ్యాఖ్యలతో వేల కోట్ల మోసం చేసి పారిపోయిన నీరవ్ మోదీ భారీ షాక్ తప్పదని తెలుస్తోంది.

బ్యాంకు కుంభకోణానికి సంబంధంచి తమ దగ్గరున్న సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ కేసు కారణంగా తమ వ్యక్తిగత జీవితం అనిశ్చితికి లోనైందని, కాబట్టి పీఎన్‌బీ స్కామ్ నుంచి తమను తప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు మారిన పూర్వి, మయాంక్ మెహతాలను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు పేర్కొంది. బెల్జియం పౌరసత్వం ఉన్న పూర్వి, నీరవ్ మోదీపై ఈడీ అభియోగం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలనే అంశంపై స్కాట్లాండ్‌లో విచారణ దశలో ఉంది.

Tags:    

Similar News