మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్‌నకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. గురువారం తెల్లవారు జామున 3.15 గంటలకు హ్యాక్ అయ్యిందని పీఎంవో ప్రకటించింది. అయితే, మోడీ ట్విట్టర్ అకౌంట్‌కు 25లక్షల ఫాలోవర్స్ ఉన్నట్లు ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది. ‘జాన్‌విక్’ అనే వ్యక్తి ప్రధాని ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్ చేశాడని.. క్రిప్టోకరెన్సీ ద్వారా పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించాలని అతను ట్వీట్లు చేసినట్లు ట్విట్టర్ […]

Update: 2020-09-02 21:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్‌నకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. గురువారం తెల్లవారు జామున 3.15 గంటలకు హ్యాక్ అయ్యిందని పీఎంవో ప్రకటించింది. అయితే, మోడీ ట్విట్టర్ అకౌంట్‌కు 25లక్షల ఫాలోవర్స్ ఉన్నట్లు ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది.

‘జాన్‌విక్’ అనే వ్యక్తి ప్రధాని ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్ చేశాడని.. క్రిప్టోకరెన్సీ ద్వారా పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించాలని అతను ట్వీట్లు చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. కాగా, ఇదే వ్యక్తిపై గతంలో పేటీఎం మాల్‌కు చెందిన డేటా చోరీ చేశాడని పలు ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News