నిబంధనలు లేని నగరాలను నిర్మించలేమా? : మోడీ
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలోని ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తుంటాయి. అలా చేయకపోతే కొందరు ఆ వాతావరణాన్ని పాడు చేస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు నడిరోడ్డుపై చెత్త చెదారం పడవేయటం, ప్లాస్టిక్ వ్యర్థాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం లాంటివి చేస్తుంటారు. అలాంటి వాటిని నియంత్రించేందుకు ఓ యంత్రాంగం వాటిని ఎళ్లవేలలా పర్యవేక్షిస్తూ ఉంటుంది. అసలు ఎలాంటి యంత్రాంగం పర్యవేక్షణ లేకుండా శుభ్రమైన, ప్రశాంతమైన […]
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలోని ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తుంటాయి. అలా చేయకపోతే కొందరు ఆ వాతావరణాన్ని పాడు చేస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు నడిరోడ్డుపై చెత్త చెదారం పడవేయటం, ప్లాస్టిక్ వ్యర్థాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం లాంటివి చేస్తుంటారు. అలాంటి వాటిని నియంత్రించేందుకు ఓ యంత్రాంగం వాటిని ఎళ్లవేలలా పర్యవేక్షిస్తూ ఉంటుంది. అసలు ఎలాంటి యంత్రాంగం పర్యవేక్షణ లేకుండా శుభ్రమైన, ప్రశాంతమైన నగరాల నిర్మాణం గురించి భారత ప్రధాని నరేంద్రమోడీ ఓ కార్యక్రమంలో ప్రసంగించారు.
‘కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో చాలా నగరాలు పరిశుభ్రమైన సరస్సులు, నదులు మరియు స్వచ్ఛమైన గాలిని చూశాయి. మనలో చాలా మంది ఇంతకు ముందు గమనించని పక్షుల కిలకిల రాగాలను వినవచ్చు. ఈ లక్షణాలు, నిబంధనలు మరియు మినహాయింపు లేని స్థిరమైన నగరాలను మనం నిర్మించలేమా? అని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ఓ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.