స్వరాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత మోదీ తొలిసారిగా సొంత రాష్ట్రానికి వెళ్లారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వెళ్లిన ఆయన శుక్రవారం కెవడియాలో ‘ఆరోగ్య వన్’ ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. అనంతరం ఉద్యానవనంలో కాసేపు గడిపారు. వందల సంఖ్యలో ఔషధ మొక్కలు, మూలికలు కలిగిన ‘ఆరోగ్య వన్’ పార్కులో, వాటి ఉపయోగాలు, ప్రాముఖ్యత గురించిన సమాచారం కూడా […]

Update: 2020-10-30 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత మోదీ తొలిసారిగా సొంత రాష్ట్రానికి వెళ్లారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వెళ్లిన ఆయన శుక్రవారం కెవడియాలో ‘ఆరోగ్య వన్’ ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. అనంతరం ఉద్యానవనంలో కాసేపు గడిపారు. వందల సంఖ్యలో ఔషధ మొక్కలు, మూలికలు కలిగిన ‘ఆరోగ్య వన్’ పార్కులో, వాటి ఉపయోగాలు, ప్రాముఖ్యత గురించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పార్కు విస్తీర్ణం 17 ఎకరాలు ఉంటుందని, మొత్తం 380 జాతులకు చెందిన ఐదు లక్షల మొక్కలు ఇందులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఔషధ మొక్కల పార్కు పర్యటన సందర్భంగా ప్రధానీ మోదీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. వారు పార్కు విశేషాలను మోదికి వివరించారు. అలాగే, మోదీ రాజకీయ గురువు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు.

Tags:    

Similar News