భూమిపూజను టీవీలో చూసిన ప్రధాని తల్లి

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో బుధవారం జరిగిన రామమందిరం పూజా కార్యక్రమాన్ని యావత్భారతం వీక్షించింది. ఎన్నోఏండ్ల తమ కల నేరివేరిందని, ఆ మహా ఘట్టాన్ని చూసి చలించిపోయామని మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఆ మహాకార్యాన్ని వీక్షించిన వారిలో ప్రధాని తల్లి కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేస్తుండగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆ ఘట్టాన్ని టీవీలో వీక్షించారు. భూమి పూజ జరుగుతున్నంత సేపు […]

Update: 2020-08-05 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో బుధవారం జరిగిన రామమందిరం పూజా కార్యక్రమాన్ని యావత్భారతం వీక్షించింది. ఎన్నోఏండ్ల తమ కల నేరివేరిందని, ఆ మహా ఘట్టాన్ని చూసి చలించిపోయామని మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఆ మహాకార్యాన్ని వీక్షించిన వారిలో ప్రధాని తల్లి కూడా ఉన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేస్తుండగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆ ఘట్టాన్ని టీవీలో వీక్షించారు. భూమి పూజ జరుగుతున్నంత సేపు చేతులు జోడించి శ్రద్ధగా తిలకించారు. వందో ఏటా అడుగుపెట్టిన హీరోబెన్ అహ్మదాబాద్‌లోని తన నివాసం నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా భూమిపూజను చూసి పులకించిపోయారు. ఆద్యంతం హర్షాతిరేకాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News