కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోడీ.. ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతున్నా..!
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇతరులను ఎలా నిందించాలో కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసునని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని, తమ పార్టీకి భవిష్యత్ లేదన్న విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ గుర్తించడం లేదన్నారు. ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్‌కు బుద్ది రావడం లేదని ప్రధాని విమర్శించారు. ఇదిలాఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం […]
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇతరులను ఎలా నిందించాలో కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసునని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని, తమ పార్టీకి భవిష్యత్ లేదన్న విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ గుర్తించడం లేదన్నారు. ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్‌కు బుద్ది రావడం లేదని ప్రధాని విమర్శించారు.
ఇదిలాఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, హ్యాకింగ్ వివాదం, వ్యవసాయ చట్టాలు మొదలకు అంశాలపై కాంగ్రెస్ ఎంపీలు ఉభయ సభల్లోనూ ఆందోళన చేస్తున్నారు. ఆ గందరగోళం కారణంగా స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తొలిరోజు ఉభయసభలను వాయిదాలతో సరిపెట్టిన విషయం తెలిసిందే. సభలో హుందాతనం లేకుండా పోయిందని, అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ పార్లమెంటరీ భేటీ సందర్భంగా ప్రధాని మోడీ మండిపడ్డారు.