మరో రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ.. వరల్డ్ నెంబర్-2 స్థానం పదిలం
దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. మోడీ పని ఇక అయిపోయిందని విమర్శకులు అంటున్న ప్రతీసారి రీ బౌన్స్ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్సర్ పర్సన్(ప్రభావవంతమైన వ్యక్తుల) జాబితాలో టేలర్ స్విఫ్ట్ తర్వాత.. మోడీ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచారు. బ్రాండ్‌వాచ్ కన్స్యూమర్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ట్విట్టర్‌లో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల జాబితాలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. మోడీ పని ఇక అయిపోయిందని విమర్శకులు అంటున్న ప్రతీసారి రీ బౌన్స్ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్సర్ పర్సన్(ప్రభావవంతమైన వ్యక్తుల) జాబితాలో టేలర్ స్విఫ్ట్ తర్వాత.. మోడీ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచారు.
బ్రాండ్‌వాచ్ కన్స్యూమర్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ట్విట్టర్‌లో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల జాబితాలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలవగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవ స్థానంలో నిలిచారు.ఇకపోతే సింగర్ కేటీ పెర్రీ మూడో స్థానంలో, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నాలుగో స్థానంలో, బరాక్ ఒబామా ఐదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 35వ స్థానంలో ఉన్నారు.