ఏచూరి ఫ్యామిలీకి ప్రధాని మోడీ, సీఎం జగన్ సంతాపం
దిశ, వెబ్డెస్క్ : సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా మహమ్మారి బారిన పడి గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీతారం ఏచూరి స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆశిష్ ఏచూరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి […]
దిశ, వెబ్డెస్క్ : సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా మహమ్మారి బారిన పడి గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీతారం ఏచూరి స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆశిష్ ఏచూరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.
Condolences to Shri Sitaram Yechury Ji and his family on the tragic and untimely demise of his son, Ashish. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 22, 2021
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2021