ధాంక్యూ జగన్ జీ: జగన్ ట్వీట్‌కి మోదీ సమాధానం
ప్రాణాలకు తెగించిన వైద్యమందిస్తున్న వైద్య సిబ్బంది మొత్తానికి సంఘీభావంగా నేటి రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆఫ్ చేసి, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డి.. “రాత్రి 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ 9 నిమిషాల పాటు ఆశాజ్యోతులను వెలిగించండి. ఒక అనంతమైన ప్రకాశంతో కమ్ముకొచ్చిన చీకటిని పారద్రోలుదాము. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు […]
ప్రాణాలకు తెగించిన వైద్యమందిస్తున్న వైద్య సిబ్బంది మొత్తానికి సంఘీభావంగా నేటి రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆఫ్ చేసి, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డి.. “రాత్రి 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ 9 నిమిషాల పాటు ఆశాజ్యోతులను వెలిగించండి. ఒక అనంతమైన ప్రకాశంతో కమ్ముకొచ్చిన చీకటిని పారద్రోలుదాము. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మనమంతా ఐక్యంగా ఉండి, కరోనా మహమ్మారిపై బలమైన శక్తిగా నిలుద్దాం” అని పిలుపునిస్తూ ట్వీట్ చేయగా, దానికి వెంటనే ప్రధాని స్పందించారు. ఆ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ, అభినందించారు. జగన్ కు ధన్యవాదాలు చెబుతూ, “ఈ క్లిష్ట సమయంలో మీ సహకారం ఎంతో విలువైనది. వైరస్ పై పోరాటంలో దేశ ప్రజల్లో సమైక్యతను నింపేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది” అని సమాధానమిచ్చారు.
Thank you @ysjagan Ji. This support is extremely valuable and will further the spirit of togetherness! #IndiaFightsCorona https://t.co/QSUnRLTd97
— Narendra Modi (@narendramodi) April 4, 2020
Tags: ysrcp, ys jagan, pm modi, bjp, twitter, tweets