కరోనా వెంటాడుతోందని మరువద్దు : మోడీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతపై ప్రధాని మోడీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసగించారు. దేశంలో పండుగలు సమీపిస్తున్నందున దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరించవద్దని..కొవిడ్ -19ను ఎంతమాత్రం నిర్లక్ష్యంగా తీసుకోరాదని సూచించారు. అసలు పెనుగండం ముందుందని, దానిని ఎదుర్కొవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ మనల్ని ఇంకా వెంటాడుతోందని అందువలన అత్యంత జాగ్రత్తగా మెలగాలని భారత ప్రధాని స్పష్టంచేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాల […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతపై ప్రధాని మోడీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసగించారు. దేశంలో పండుగలు సమీపిస్తున్నందున దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరించవద్దని..కొవిడ్ -19ను ఎంతమాత్రం నిర్లక్ష్యంగా తీసుకోరాదని సూచించారు. అసలు పెనుగండం ముందుందని, దానిని ఎదుర్కొవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ మనల్ని ఇంకా వెంటాడుతోందని అందువలన అత్యంత జాగ్రత్తగా మెలగాలని భారత ప్రధాని స్పష్టంచేశారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని.. మనదేశంలో కరోనాను అదుపు చేయాలంటే టెస్టింగ్‌లు మాత్రమే భారత్ ఆయుధమన్నారు. కరోనాను ఎదుర్కొనడంలో అగ్రదేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని, అందుకోసం మనవైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారని గుర్తుచేశారు.
లాక్‌డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందన్నారు. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా 90లక్షల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, సేవా పరమో ధర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ మన ఆరోగ్య కర్తలు విశేష సేవలందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశంలో ప్రతి పది లక్షల మందిలో ఐదున్నర వేలమందికి కరోనా సోకిందని.. 10లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయని మోడీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని ఇలానే కొనసాగిద్దామని, కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.