భారీగా పెరిగిన ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు

దిశ వెబ్ డెస్క్: రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి దేశ వ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో రైల్వే ప్లాట్ ఫామ్ లలో రద్దీని తగ్గించేందుకు సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బెంగుళూరులోని మూడు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బెంగుళూరులోని కేఎస్ఆర్ […]

Update: 2020-09-11 08:40 GMT

దిశ వెబ్ డెస్క్: రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి దేశ వ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో రైల్వే ప్లాట్ ఫామ్ లలో రద్దీని తగ్గించేందుకు సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బెంగుళూరులోని మూడు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో బెంగుళూరులోని కేఎస్ఆర్ బెంగుళూరు, యశ్వంత్ పూర్ జంక్షన్, బెంగుళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లలో పెంచిన ధరలను అమలులోకి తేనున్నారు. కాగా ఈ ధరలు తాత్కాలికంగా పెంచినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో క్లోన్ ట్రైన్స్ నడుపుతామని రైల్వే శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News