హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్.. ఒకేసారి 200 నామినేషన్లు.?
దిశ, హుజురాబాద్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 200 మంది నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీఎస్ 61 ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. 11వ పీఆర్సీ అమలులో సర్వీసు, ఆర్థిక పరమైన అంశాలలో జరిగిన అన్యాయానికి నిరసనగానే నామినేషన్లు సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, […]
దిశ, హుజురాబాద్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 200 మంది నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీఎస్ 61 ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. 11వ పీఆర్సీ అమలులో సర్వీసు, ఆర్థిక పరమైన అంశాలలో జరిగిన అన్యాయానికి నిరసనగానే నామినేషన్లు సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య తెలిపారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌లకు పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని విన్నవించినప్పటికీ ఫలితం కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా 20 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఫుల్ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.