కేరళ సీఎంగా పినరయి ప్రమాణ స్వీకారం..
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోని రావడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ మహోత్తర కార్యక్రమానికి తిరువనంతపురం సెంట్రల్ స్టేడియం వేదిక అయ్యింది. పినరయితో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలాఉండగా, ఈసారి పినరయి తన కేబినెట్‌లో ముగ్గురు మహిళలతో పాటు అంతా కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తన […]
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోని రావడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ మహోత్తర కార్యక్రమానికి తిరువనంతపురం సెంట్రల్ స్టేడియం వేదిక అయ్యింది. పినరయితో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇదిలాఉండగా, ఈసారి పినరయి తన కేబినెట్‌లో ముగ్గురు మహిళలతో పాటు అంతా కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తన ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా ఉండేందుకే పినరయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతా అనుకుంటున్నారు. కాగా, ప్రతీసారి కేరళలో అధికారి మార్పిడి సర్వసాధారణంగా ఉండేది. అయితే, ఎల్డీఎఫ్ పార్టీ ఈ సంప్రదాయానికి చెక్ పెట్టి 90కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కుకుంది.