వరుసగా రెండోసారి అగ్రస్థానంలో ఫోన్‌పే
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పేమెంట్ యాప్ ఫోన్‌పే వరుసగా రెండో నెలలోనూ యూపీఐ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతతో ఈ జాబితాలో వాల్‌మార్ట్‌కు చెందిన గూగుల్ పేను దాటి టాప్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) యాప్‌గా ఫోన్‌పే కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే 41 శాతం వాటాతో మొత్తం 96.87 కోట్ల లావాదేవీలతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపిన వివరాల ప్రకారం..ఫోన్‌పే […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పేమెంట్ యాప్ ఫోన్‌పే వరుసగా రెండో నెలలోనూ యూపీఐ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతతో ఈ జాబితాలో వాల్‌మార్ట్‌కు చెందిన గూగుల్ పేను దాటి టాప్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) యాప్‌గా ఫోన్‌పే కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే 41 శాతం వాటాతో మొత్తం 96.87 కోట్ల లావాదేవీలతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపిన వివరాల ప్రకారం..ఫోన్‌పే లావాదేవీలు 7 శాతం పెరిగాయని, లావాదేవీల విలువ 5 శాతం పెరిగాయని తెలుస్తోంది.
ఫోన్‌పే తర్వాత రెండో స్థానంలో గూగుల్ పే 85.35 కోట్ల లావాదేవీలతో కొనసాగుతోంది. వీటి మొత్తం విలువ రూ. 1.71 లక్షల కోట్లు. అలాగే, పేటీఎం సంస్థ మొత్తం 28.11 కోట్ల లావాదేవీలతో మూడో స్థానంలో ఉంది. వీటి తర్వాత అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే యాప్‌లు ఉన్నాయి. ఈ జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం 230 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయని, వీటి విలువ రూ. 4.2 లక్షల కోట్లని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఇటీవల తెలిపారు.