విద్యార్థులూ.. 'మీరు ఇది గమనించాలి'

దిశ, వరంగల్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా చదువుతున్న వైద్య విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నెల 20, 22, 24వ తేదీల్లో పీజీ డిప్లొమా పరీక్షలు, ఈ నెల 20, 22, 24, 26వ తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 13 సెంటర్లను ఏర్పాటు చేశామని, 1187 మంది […]

Update: 2020-06-19 21:26 GMT

దిశ, వరంగల్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా చదువుతున్న వైద్య విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నెల 20, 22, 24వ తేదీల్లో పీజీ డిప్లొమా పరీక్షలు, ఈ నెల 20, 22, 24, 26వ తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 13 సెంటర్లను ఏర్పాటు చేశామని, 1187 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 నిమిషాలకే చేరుకోవాలని సూచించారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామన్నారు. పెద్ద లెక్చర్ హాల్స్, ఎగ్జాం హాల్స్ లో 25 నుంచి 30 మంది విద్యార్థులకు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్ ను కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశామని, విద్యార్థులు గమనించాల్సిందిగా కోరారు.

Tags:    

Similar News