రెండేళ్ల గరిష్ఠానికి పెట్రోల్ ధరలు.!
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా చమురు రంగ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. గత కొద్దిరోజుల్లోనే సగటున పెట్రోల్ 33 పైసల వరకు, డీజిల్ 30 పైసల వరకు పెరిగిపోయాయి. ఢిల్లీలో ఏకంగా పెట్రోల్ లీటర్ రూ. 90కి చేరువలో రూ. 83.77 ఉండగా, డీజిల్ లీటర్ రూ. 73.93కి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రెండేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. దాదాపు 50 రోజుల తర్వాత గత నెల […]
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా చమురు రంగ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. గత కొద్దిరోజుల్లోనే సగటున పెట్రోల్ 33 పైసల వరకు, డీజిల్ 30 పైసల వరకు పెరిగిపోయాయి. ఢిల్లీలో ఏకంగా పెట్రోల్ లీటర్ రూ. 90కి చేరువలో రూ. 83.77 ఉండగా, డీజిల్ లీటర్ రూ. 73.93కి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రెండేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. దాదాపు 50 రోజుల తర్వాత గత నెల 20న పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి.
దేశ రాజధానిలో పెట్రోల్ పెరుగుదల 2018 నాటి రూ. 84 ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరువలో ఉంది. ఇలాగే పెరుగుతూ పోతే దీన్ని దాటి కొత్త రికార్డులను చేరుకోవచ్చని తెలుస్తోంది. కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 90.34 వద్ద ఉండగా, 2018 నాటి రూ. 91.3 రికార్డు ధరకు అడుగు దూరంలో నిలిచింది. చెన్నైలో రూ. 86.51 ఉండగా, కోల్‌కతాలో రూ. 85.19తో రికార్డు గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం పదిహేను రోజుల్లోనే రికార్డు గరిష్టానికి దగ్గరికి వచ్చాయి. కొవిడ్-19 కేసులు తగ్గిపోవడం, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పునరుద్ధరణ కావడంతో చమురు వినియోగం భారీగా పెరుగుతున్నాయనే అంచనాలున్నాయి.
ఉత్పత్తిని తగ్గించడంతో…
ప్రధానంగా రష్యాతో పాటు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించేందుకు అంగీకరించాయి. ఈ ఏడాది కరోనా ప్రభావం కారణంగా చమురు ఉత్పత్తికి 2021, జనవరి వరకు తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఒపెక్ దేశాలు రోజుకు 7.7 మిలియన్ బ్యారెళ్ల చొప్పున ఉత్పత్తిని తగ్గించాయి. దీన్ని వచ్చే ఏడాది జనవరి వరకు అనుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించాయి. ఇటీవల జరిగిన ఒప్పందాన్ని అనుసరిస్తూ రోజుకు 7 మిలియన్ బ్యాలెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, అంతర్జాతీయ ధరల ప్రభావం కారణంగా దేశీయ చమురు దిగ్గజ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, ధరలను పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను అనుసరించి దేశీయ కంపెనీలు పెట్రోల్ ధరలను సవరిస్తుంటాయి. దీనికి ముఖ్యంగా రెండు వారాల్లో ఉన్న సగటు చమురు ధరలు, రూపాయి మారకం విలువను ధరల పెంపునకు పరిగణలోకి తీసుకుంటాయి. స్థానిక అమ్మకపు పన్ను లేదంటే వ్యాట్‌ని బట్టి చమురు ధరలు రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య మారుతాయి.