పెరుగుతున్న పెట్రోల్ ధరలు: మీ సెల్ ఫోన్లలో మారు మోగనున్న కాలర్ ట్యూన్
దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే.. మనదగ్గర మాత్రం ఎందుకు తగ్గుతున్నాయి. వాస్తవంగా ఇండియాలో పెట్రోల్ ధరెంత? కానీ మనం కొంటున్న రేట్ ఎంత? ఆ మిగిలిన మొత్తాన్ని దోచేస్తుంది ఎవరూ? పెట్రోల్ కంపెనీలా! కేంద్ర సర్కారా! లేక రాష్ట్ర ప్రభుత్వాలా ! చమురు ధరలతో పీల్చి పిప్పి చేస్తుందెవరూ? అనే ప్రశ్నకు సమాధానంలేదు. దీంతో వాహనదారులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే.., మనదేశాల్లో ఎందుకు పెరుగుతున్నాయో సమాధానం […]
దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే.. మనదగ్గర మాత్రం ఎందుకు తగ్గుతున్నాయి. వాస్తవంగా ఇండియాలో పెట్రోల్ ధరెంత? కానీ మనం కొంటున్న రేట్ ఎంత? ఆ మిగిలిన మొత్తాన్ని దోచేస్తుంది ఎవరూ? పెట్రోల్ కంపెనీలా! కేంద్ర సర్కారా! లేక రాష్ట్ర ప్రభుత్వాలా ! చమురు ధరలతో పీల్చి పిప్పి చేస్తుందెవరూ? అనే ప్రశ్నకు సమాధానంలేదు. దీంతో వాహనదారులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే.., మనదేశాల్లో ఎందుకు పెరుగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ తరానికి జోక్స్ కన్నా మీమ్స్ అంటేనే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై మీమ్స్, సెటైర్లు వేస్తూ ఫన్ యాడ్ చేస్తున్నారు.
బ్యాట్ తో సచిన్ పెట్రోల్ బంకులో సెంచరీ కొట్టినట్లు, ఓ యజమాని తన కారుకు డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే.., ఆయన్ని ఇంటర్వ్యూ చేసేందుకు రిపోర్టర్లు ఇంటర్వ్యూలు చేయడంలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు అనుగుణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ ఇలా ఉంది. ” నమస్కారం ధరలు పెరగడం ఇప్పుడు దేశమంతా మొదలైంది… తినడం తగ్గించుకోండి..పాత బట్టలు వాడండి.. వీలైనంత వరకు నడవడం అలవాటు చేసుకోండి.ఇంధనంతో నడిచే వాహనాలు వాడకండి.. గుర్తుంచుకోండి మీరు పోరాడాల్సింది ధరలతో..ప్రభుత్వంతో కాదు’ అంటూ ఓ మెసేజ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.