మీరు ‘బ్లూ టూత్’ అధికంగా వాడుతున్నారా..? బీకేర్ ఫుల్.. ఇది మీకోసమే!

దిశ, వెబ్‌డెస్క్ : యవత ఇటీవల ‘బ్లూ టూత్’ డివైస్‌లకు ఎక్కువగా అలవాటు పడింది. వీటి వలన రేడియేషన్ తగ్గడం ఎంతవరకు నిజమో కానీ, నెమ్మదిగా అది అందరికీ రీచ్ అయిపోయింది. స్టూడెంట్స్ నుంచి జాబర్స్, పెద్దవాళ్లు సైతం ఈ డివైస్‌లకు బాగా అలవాటు పడిపోయారు. ఫోన్ ఎక్కడో పెట్టి కాల్ రాగానే టక్కున సింగిల్ బటన్ ప్రెస్‌తో అవుతలి వ్యక్తితో సంభాషిస్తుంటారు. దీంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. ఫోన్ చేత్తో పట్టుకుని ఎక్కువగా […]

Update: 2021-08-06 11:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యవత ఇటీవల ‘బ్లూ టూత్’ డివైస్‌లకు ఎక్కువగా అలవాటు పడింది. వీటి వలన రేడియేషన్ తగ్గడం ఎంతవరకు నిజమో కానీ, నెమ్మదిగా అది అందరికీ రీచ్ అయిపోయింది. స్టూడెంట్స్ నుంచి జాబర్స్, పెద్దవాళ్లు సైతం ఈ డివైస్‌లకు బాగా అలవాటు పడిపోయారు. ఫోన్ ఎక్కడో పెట్టి కాల్ రాగానే టక్కున సింగిల్ బటన్ ప్రెస్‌తో అవుతలి వ్యక్తితో సంభాషిస్తుంటారు. దీంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.

ఫోన్ చేత్తో పట్టుకుని ఎక్కువగా మాట్లాడటం వలన హ్యాండ్ పెయిన్‌తో పాటు మొబైల్ నుంచి ఎక్కువగా రేడియేషన్ విడుదలయ్యే చాన్స్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చాలా మంది హెడ్ సెట్ లేదా బ్లూ టూత్ డివైస్‌లను వినియోగిస్తున్నారు. అయితే, వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారణం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌‌లోని చౌము ప్రాంతం ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేశ్ బ్లూ టూత్ రెగ్యులర్‌గా వినియోగించేవాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. కాల్ మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా బ్లూ టూత్ పేలడంతో రెండు చెవులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ భయంతోనే కార్డియాక్ స్ట్రోక్ (గుండెపోటు) కూడా వచ్చింది.

దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా రెండు చెవుల నుంచి తీవ్రంగా రక్తస్రావం జరగడం, గుండెపోటు కూడా వచ్చి అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఇలాంటి కేసు దేశంలోనే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు. హెడ్ సెట్, బ్లూ టూత్ వినియోగించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ అయినా అధికంగా వాడటం వలన

Tags:    

Similar News