ఆంధ్రాలో కేసీఆర్ పార్టీ పెట్టాలి.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలంటూ వేల సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు లెక్కలేనన్ని విజ్ఞాపనలు వస్తే ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఎందుకుని.. రెండు తెలుగు రాష్ట్రాలను […]

Update: 2021-10-28 04:53 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలంటూ వేల సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు లెక్కలేనన్ని విజ్ఞాపనలు వస్తే ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఎందుకుని.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపిస్తే పోలేదా అని చమత్కరించారు. ఏపీ, తెలంగాణను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా చేస్తే రెండు పార్టీలు ఎందుకని, ఒకే పార్టీ ఉంటుంది కదా అంటూ సెటైర్లు వేశారు.

2013లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు విడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాలను అన్యాయంగా విడగొట్టవద్దని సీఎం జగన్ పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన విషయాన్ని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ఇకపోతే ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఏపీలో పార్టీ పెట్టాలని విజ్ఞాపనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News