శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌ కోర్ ఆలయ బోర్డు గుడ్‌‌న్యూస్ చెప్పింది. రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని తెరవగా… సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు టీడీబీ తెలిపింది. కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నట్లు బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిలక్కల్, పంబా బేస్ క్యాంప్‌నకు చేరుకునే 48గంటల ముందు చేయించుకున్న పరీక్షలో కరోనా నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన భక్తులను అనుమతిస్తామని […]

Update: 2020-11-15 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌ కోర్ ఆలయ బోర్డు గుడ్‌‌న్యూస్ చెప్పింది. రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని తెరవగా… సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు టీడీబీ తెలిపింది. కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నట్లు బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిలక్కల్, పంబా బేస్ క్యాంప్‌నకు చేరుకునే 48గంటల ముందు చేయించుకున్న పరీక్షలో కరోనా నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. వర్చువల్ క్యూ పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్న వెయ్యిమంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించనుండగా.. శని, ఆదివారాల్లో 2వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవచ్చు. 10 ఏళ్లలోపు, 60ఏళ్ల పైబడిన వారిని దర్శనానికి అనుమతించరు.

Tags:    

Similar News