బాణసంచా దుకాణాలకు పర్మిషన్ తీసుకోవాలి !
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండగకు బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈనెల 10వరకు www.tspolice.gov.in, eservices.tspolice.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్‌ఓసీ.. ప్రభుత్వ స్థలమైతే జీహెచ్‌ఎంసీ, ప్రయివేటు స్థలాలైతే యజమానుల అనుమతి పత్రాలను జత చేయాలన్నారు. గతేడాది అనుమతి పత్రం కూడా ఉండాలని పేర్కొన్నారు. దుకాణం ఏర్పాటు చేసే ప్రదేశం వివరాలు, ఒరిజినల్ లైసెన్స్ ఫీజుకింద రూ.600 స్టేట్ […]
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండగకు బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈనెల 10వరకు www.tspolice.gov.in, eservices.tspolice.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్‌ఓసీ.. ప్రభుత్వ స్థలమైతే జీహెచ్‌ఎంసీ, ప్రయివేటు స్థలాలైతే యజమానుల అనుమతి పత్రాలను జత చేయాలన్నారు. గతేడాది అనుమతి పత్రం కూడా ఉండాలని పేర్కొన్నారు. దుకాణం ఏర్పాటు చేసే ప్రదేశం వివరాలు, ఒరిజినల్ లైసెన్స్ ఫీజుకింద రూ.600 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, గన్‌ఫౌండ్రి పేరుతో చెల్లించాలని స్పష్టం చేశారు.