చిలుకూరులో ‘రేపాసుర’ దహనం

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషులను ఉరితీయటంలో దేశంలో పలు చోట్ల సంబురాలు చేసుకున్న సంగతి తెలిసిందే..కాని చిలుకూరు ఆలయంలో ఓ అడుగు ముందుకేసి రేపాసుర దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన రాక్షసులను ఉరి తీసిన రోజు(మార్చి20) నిజమైన దీపావళి అని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ అన్నారు. నలుగురు రాక్షసులను ఉరి తీయటం నాలుగింతల దీపావళిగా అభివర్ణించారు. నలుగురు దోషలూ చట్టాన్నీ, న్యాయవ్యవస్థను అవహేళన చేస్తూ.. మృగాళ్లలా ప్రవర్తించారని, […]

Update: 2020-03-20 22:26 GMT

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషులను ఉరితీయటంలో దేశంలో పలు చోట్ల సంబురాలు చేసుకున్న సంగతి తెలిసిందే..కాని చిలుకూరు ఆలయంలో ఓ అడుగు ముందుకేసి రేపాసుర దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన రాక్షసులను ఉరి తీసిన రోజు(మార్చి20) నిజమైన దీపావళి అని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ అన్నారు. నలుగురు రాక్షసులను ఉరి తీయటం నాలుగింతల దీపావళిగా అభివర్ణించారు. నలుగురు దోషలూ చట్టాన్నీ, న్యాయవ్యవస్థను అవహేళన చేస్తూ.. మృగాళ్లలా ప్రవర్తించారని, ఆలస్యమైనా వారికి తగిన శిక్షపడిందని పేర్కొన్నారు. చట్టాల్లోని లోపాలను సవరించి మరింత కఠినతరం చేయడానికి ఇదే సరైన సమయం అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు.

Tags: nirbhaya convicts, hanged, tihar jail, many celebrations across, also in chilkur

Tags:    

Similar News