లాక్ డౌన్ పొడిగింపుపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్య
న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా.. ప్రజలు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఒకవేళ 14వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించినా రేపటి శుభ ఉదయం కోసం ఇంకా కొంతకాలం బాధను దిగమింగుకొని ఉందామని అన్నారు. వచ్చేవారం చోటుచేసుకునే పరిణామాలు, కరోనా విస్తరణ వేగం లాంటి సమాచారంపైనే నిర్బంధం పొడిగింపు నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ పతనం గురించి చర్చలు జరుగుతున్నాయని చెబుతూ.. […]
న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా.. ప్రజలు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఒకవేళ 14వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించినా రేపటి శుభ ఉదయం కోసం ఇంకా కొంతకాలం బాధను దిగమింగుకొని ఉందామని అన్నారు. వచ్చేవారం చోటుచేసుకునే పరిణామాలు, కరోనా విస్తరణ వేగం లాంటి సమాచారంపైనే నిర్బంధం పొడిగింపు నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ పతనం గురించి చర్చలు జరుగుతున్నాయని చెబుతూ.. ఆర్థికం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని వివరించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాలా వద్ద అన్న చర్చలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ పొడిగింపు అంశంపై ప్రధాని క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు.
Tags: Coronavirus, lockdown, extension, vice president, venkaiah naidu