‘భీమ్‌‌గల్‌‌ ప్రజలలో లాక్‌‌డౌన్‌‌ మూడ్‌‌ లేదు’

దిశ, బాల్కొండ: ప్రజలు ఇప్పటికీ లాక్‌డౌన్ మూడ్‌లో లేరు. ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. లాక్‌‌డౌన్‌‌ సరిగ్గా అమలు కావడం లేదని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఫీవర్ సర్వే, లాక్‌‌డౌన్‌‌ పరిశీలనలో భాగంగా గత మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదివారం భీమ్‌‌గల్‌‌ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్‌‌‌లో అధికారులతో మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బాల్కొండ […]

Update: 2021-05-16 08:47 GMT

దిశ, బాల్కొండ: ప్రజలు ఇప్పటికీ లాక్‌డౌన్ మూడ్‌లో లేరు. ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. లాక్‌‌డౌన్‌‌ సరిగ్గా అమలు కావడం లేదని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఫీవర్ సర్వే, లాక్‌‌డౌన్‌‌ పరిశీలనలో భాగంగా గత మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదివారం భీమ్‌‌గల్‌‌ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్‌‌‌లో అధికారులతో మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

బాల్కొండ నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ అయిన భీమ్‌‌గల్‌‌ పట్టణంలో అమలవుతున్న లాక్‌‌డౌన్‌‌ పట్ల మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘లాక్‌‌డౌన్‌‌ అమలులో మీరు ఫెయిల్‌‌ అవుతున్నారు. భీమ్‌‌గల్‌‌లో ఎక్కడ సరిగ్గా లాక్‌‌డౌన్‌‌ అమలు కావడం లేదు. ఈ లాక్‌‌డౌన్‌‌ టైం లో మీకు వేరే ఏ పని లేదు. ఎక్కువగా కష్టపడుతూ, యాక్టీవ్‌‌ గా వర్క్‌‌ చేయండి’ అని సీఐ కి సూచించారు.

Tags:    

Similar News