మాకు భయమైతోంది.. మేం వెళ్తున్నాం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో పట్నం ప్రజలు పల్లె బాట పడుతున్నారు. సుమారు రెండు వారాల క్రితం వరకు ఓ మోస్తరుగా నమోదైన కేసులు కొన్ని రోజులుగా గణనీయంగా పెరిగిపోతుండడంతో నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనుల మీద బయటకు వెళ్లాల్సి రావడం, వెళితే కరోనా ఎక్కడ పట్టుకుంటుందోననే భయం వారిని వెంటాడుతోంది. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ గ్రామాల బాట పడుతున్నారు. […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో పట్నం ప్రజలు పల్లె బాట పడుతున్నారు. సుమారు రెండు వారాల క్రితం వరకు ఓ మోస్తరుగా నమోదైన కేసులు కొన్ని రోజులుగా గణనీయంగా పెరిగిపోతుండడంతో నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనుల మీద బయటకు వెళ్లాల్సి రావడం, వెళితే కరోనా ఎక్కడ పట్టుకుంటుందోననే భయం వారిని వెంటాడుతోంది. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ గ్రామాల బాట పడుతున్నారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకోక పోవడంతో ఇప్పటికే ఊర్లకు వెళ్లిపోయిన వారు అక్కడే ఉండగా కరోనా భయంతో పట్నంలో ఉన్నవారు పల్లె బాట పడుతున్నారు. గతంలో వేసవి సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభమైతే నగరంలో అనుకున్న ప్రాంతంలో కిరాయి ఇండ్లు దొరకడం కొంచెం కష్టంగానే ఉండేది. కానీ, ఈ యేడు అందుకు భిన్నంగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలలో ఏరియాతో సంబంధం లేకుండా ఇండ్లకు టు లెట్ బోర్డులు దర్శన మిస్తున్నాయి. కారణం ఆరా తీస్తే గతంలో అద్దెకు ఉన్నవారు కరోనా భయంతో ఖాళీ చేసి ఊరికి వెళ్లి పోయారనే సమాధానం పలువురు ఇంటి యజమానుల నుండి వస్తోంది.