పెన్షన్ నిధులు మొత్తం విత్‌డ్రాకు అవకాశం ఇచ్చే యోచనలో పీఎఫ్ఆర్‌డీఏ!

దిశ, వెబ్‌డెస్క్: భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ(పీఎఫ్ఆర్‌డీఏ) పెన్షన్ నిధులను విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో కీలక మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పెన్షన్ నిధి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును పింఛనుదారులకు కల్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కుటుంబంలో అత్యవసర వినియోగానికి లేదంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైర్డ్ అయిన వ్యక్తులు తమ పెన్షన్ నిధులు మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ […]

Update: 2021-05-18 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ(పీఎఫ్ఆర్‌డీఏ) పెన్షన్ నిధులను విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో కీలక మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పెన్షన్ నిధి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును పింఛనుదారులకు కల్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కుటుంబంలో అత్యవసర వినియోగానికి లేదంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైర్డ్ అయిన వ్యక్తులు తమ పెన్షన్ నిధులు మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్‌పీఎస్ నుంచి రూ. 2 లక్షల వరకు విత్‌డ్రా పరిమితికి అనుమతులు ఉన్నాయి.

ఇది కాకుండా పెన్షన్ మొత్తం నిధుల్లోంచి 60 శాతం విత్‌డ్రా చేసుకుని, మిగిలిన 40 శాతం నిధులను ప్రభుత్వం అనుమతి ఉన్నటువంటి యాన్యూటీలలో ఉంచాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. కొత్త విధానంలో రూ. 5 లక్షల వరకు పెన్షన్ నిధులను కలిగిన చందాదారులు ఆ మొత్తాన్ని ఒక్కసారే ఉపసంహరించుకోవచ్చు. మొత్తం విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఇచ్చినప్పటికీ, చందాదారులు తమ పెన్షన్ నగదులోంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వం అనుమతి ఉన్న యాన్యూటీల్లోనూ లేదంటే పెన్షన్ ఫండ్ మేనేజర్ల సహకారంతో పెట్టుబడులు చేసుకునే అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News