Telangana Artists Pension : వృద్ధ కళాకారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు పెన్షన్‎ను రూ.3016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కళలకు పుట్టినిల్లు, సకల కళల ఖజానాగా అభివర్ణించారు. ఎంతో మంది జానపద, గ్రామీణ గిరిజన కళాకారులకు కొలువైన నేల తెలంగాణ అన్నారు. వృద్ధ […]

Update: 2021-05-27 10:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు పెన్షన్‎ను రూ.3016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కళలకు పుట్టినిల్లు, సకల కళల ఖజానాగా అభివర్ణించారు. ఎంతో మంది జానపద, గ్రామీణ గిరిజన కళాకారులకు కొలువైన నేల తెలంగాణ అన్నారు. వృద్ధ కళాకారులకు రూ.1500 నుంచి రూ.3016 కు వృద్దాప్య పెన్షన్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయం తీసుకోవడంతో పాటు జీఓ జారీ చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కళా ప్రియుడు, సాహితీ వేత్త అని, ఆయనకు కళాకారులంటే ఎంతో గౌరవం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2021 జూన్ 2 నుంచి కళాకారులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 2661 మంది వృద్ధకళాకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కళాకారులకు పెన్షన్ రూ. 500 మాత్రమే ఉండేదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెన్షన్ నుంచి పెంచారని తెలిపారు.

550 మంది కళాకారులకు ఉద్యోగాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి అనే వ్యవస్థను ఏర్పాటుచేసి 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం 16 కోట్ల 17 లక్షల రూపాయలను కేటాయించామన్నారు. దేశంలోనే కళాకారులకు ఉద్యోగాలిచ్చి గౌరవించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైకోర్టు ఆదేశాలననుసరించి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఎంపిక కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన కళాకారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను వెల్లడించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ, బోనాలు పండుగ, సమ్మక్కసారక్క, ఏడుపాయల, నాగోబా, కురుమూర్తి వంటి జాతరలను నిర్వహిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Tags:    

Similar News