ట్రాఫిక్ పోలీసులకు షాక్.. ఒక్క వాహనంపై 61 చలాన్లు..!
దిశ, భద్రాచలం టౌన్ : ఒకటిరెండు కాదు. భద్రాచలంలో తిరుగుతున్న ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 61 చలానాలు (ఫైన్) పెండింగులో ఉన్నాయి. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసులు షాక్ అయ్యారు. వాహనాన్ని సీజ్ చేశారు. లాక్‌డౌన్ వేళ భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్ తన సిబ్బందితో కలిసి మంగళవారం రహదారిపై కాపుగాచి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన హోండా కంపెనీ ద్విచక్ర వాహనాన్ని ( ఏపీ 11 ఏడి 4192) ఆపారు. […]
దిశ, భద్రాచలం టౌన్ : ఒకటిరెండు కాదు. భద్రాచలంలో తిరుగుతున్న ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 61 చలానాలు (ఫైన్) పెండింగులో ఉన్నాయి. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసులు షాక్ అయ్యారు. వాహనాన్ని సీజ్ చేశారు. లాక్‌డౌన్ వేళ భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్ తన సిబ్బందితో కలిసి మంగళవారం రహదారిపై కాపుగాచి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
ఆ సమయంలో అటుగా వచ్చిన హోండా కంపెనీ ద్విచక్ర వాహనాన్ని ( ఏపీ 11 ఏడి 4192) ఆపారు. నితీశ్ అనే యువకుడు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఆ వాహనానికి ముందు, వెనుక నంబర్ ప్లేట్స్ లేకపోవడంతో చాసిస్ నంబర్‌ని బట్టి చెక్ చేయగా ఆ వాహనం మీద ఇప్పటికే 61 చలానాలు పెండింగులో ఉన్నట్లుగా చూసి ట్రాఫిక్ పోలీసులు ఖంగు తిన్నారు. చలానాకు సంబంధించి రూ.15,535 పెండింగ్ ఉంది. వెంటనే ఆ వాహనాన్ని సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు.