సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలుకాలనీల్లో దాదాపు వెయ్యి ఇళ్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. బురద నీటిలో విలవిల్లాడుతున్న ఉస్మాన్‌నగర్, అబ్దుల్లా యహియానగర్, సయిఫ్‌నగర్ ప్రజలను ఆదుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ముందుకు రాలేదన్నారు. సంబంధిత అధికారులు, కలెక్టర్‌ను వివరణ కోరతే.. ప్రభుత్వానికి నివేదికలు పంపామని, నిధులు మంజూరుకాగానే పనులు చేస్తామని చెబుతున్నట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలుకాలనీల్లో దాదాపు వెయ్యి ఇళ్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. బురద నీటిలో విలవిల్లాడుతున్న ఉస్మాన్‌నగర్, అబ్దుల్లా యహియానగర్, సయిఫ్‌నగర్ ప్రజలను ఆదుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ముందుకు రాలేదన్నారు. సంబంధిత అధికారులు, కలెక్టర్‌ను వివరణ కోరతే.. ప్రభుత్వానికి నివేదికలు పంపామని, నిధులు మంజూరుకాగానే పనులు చేస్తామని చెబుతున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. ప్రతి చిన్న నష్టాన్ని అంచనా వేసి ప్రతిఇంటికి లక్ష నుంచి రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలని, వరదల్లో కొట్టుకుపోయి చనిపోయినవారి ఫ్యామిలీలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.