ఆసియా కప్ : బీసీసీఐతో పీసీబీ ఢీ !
దిశ, స్పోర్ట్స్: తమతో ద్వైపాక్షిక సీరీస్ ఆడట్లేదనే అక్కసో.. తమ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి నిషేధించిందన్న ఆక్రోషమో లేక ఐసీసీ దగ్గర బీసీసీఐ మాటే చెల్లుబాటు అవుతోందన్న అసూయో ! కారణం ఏదైతేనేం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు సందు దొరికితే చాలు.. బీసీసీఐపై విరుచుకుపడటం రివాజుగా మారింది. అంతేనా ఆసియా కప్‌ను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరతీసింది. ప్రపంచమంతా కరోనా కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో క్రీడారంగం స్తంభించిపోయి పలు క్రీడా బోర్డులు, అసోసియేషన్లు […]
దిశ, స్పోర్ట్స్: తమతో ద్వైపాక్షిక సీరీస్ ఆడట్లేదనే అక్కసో.. తమ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి నిషేధించిందన్న ఆక్రోషమో లేక ఐసీసీ దగ్గర బీసీసీఐ మాటే చెల్లుబాటు అవుతోందన్న అసూయో ! కారణం ఏదైతేనేం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు సందు దొరికితే చాలు.. బీసీసీఐపై విరుచుకుపడటం రివాజుగా మారింది. అంతేనా ఆసియా కప్‌ను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరతీసింది. ప్రపంచమంతా కరోనా కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో క్రీడారంగం స్తంభించిపోయి పలు క్రీడా బోర్డులు, అసోసియేషన్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు వేటికవే ప్రణాళికలు రచిస్తున్నాయి. బీసీసీఐ కూడా కరోనా ప్రభావం తగ్గితే తమ ప్రధాన ఆదాయ వనరు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలా నిర్వహించాలనే విషయంపై సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ను కాస్త వెనక్కి జరిపి, ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసింది. కానీ దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలతో ఇంకా చర్చించలేదు. అంతలోనే.. ఈ ఏడాది ఆసియా కప్‌ను నిర్వహించనున్న పీసీబీ అడ్డుపుల్లలు వేస్తోంది. ఆసియా కప్ షెడ్యూల్‌పై అధికారిక చర్చ జరగకుండానే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగింది. బీసీసీఐ కుట్ర పూర్వకంగా ఐపీఎల్ సీజన్ 13 కోసం ఆసియా కప్ షెడ్యూల్ మార్చడానికి ప్రయత్నిస్తోందంటూ కొత్త ఆరోపణలు చేస్తోంది. ‘ఆసియా కప్ షెడ్యూల్ వెనక్కి జరిపితే మేం ఊరుకోం’ అంటూ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
వాస్తవానికి ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగాలి. కానీ అక్కడ ఆడేందుకు భారత్ సహా ఇతర ఆసియా దేశాలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో వేదికను దుబాయ్‌కి మార్చారు. ఇలా వేదిక మార్పునకు కూడా బీసీసీఐనే కారణమని.. ఇప్పుడు తనకున్న ధనబలం, పలుకుబడితో ఐపీఎల్ కోసం ఆసియా కప్‌ను బలి చేస్తోందని పీసీబీ ఆరోపిస్తోంది. ‘ఆసియా కప్ సభ్యత్వ దేశాల్లో ఒకటైన భారత్ కోసం షెడ్యూల్ మార్చాలా..? వాళ్ల ఐపీఎల్ కోసం ఆసియాకప్‌ను ఎందుకు వెనక్కు జరపాలని’ పీసీబీ సీఈవో వసీం ఖాన్ అంటున్నారు. ప్రధాన సిరీస్‌లు, ఇతర క్రికెట్ షెడ్యూల్స్‌కు ఆటంకం కలగకుండా.. బీసీసీఐ.. ఐపీఎల్‌ను అక్టోబర్‌లో నిర్వహించాలనే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే. కానీ అందుకోసం ఆసియా కప్‌ను వెనక్కు జరపాలనే ప్రతిపాదన చేయలేదు. ‘అక్టోబర్ 6కే ఆసియా కప్ ముగుస్తుంది. దాని తర్వాతే ఐపీఎల్ 13 నిర్వహణకు కసరత్తు చేస్తున్నాం’ అని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. కానీ, పీసీబీ ముందుగానే బీసీసీఐ ప్రణాళికలకు అడ్డుకట్ట వేయాలని అనవసరపు ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. అయినా, మనం ఎన్ని ప్రణాళికలు వేసినా ముందు కరోనా ప్రభావం తగ్గాలి కదా..! అప్పుడే కదా మనం ఎన్ని ఆలోచనలు చేసినా విజయవంతం అయ్యేది. అయినా ఏవేవో మనసులో పెట్టుకొని ఇతర క్రికెట్ బోర్డులకు నష్టపరిచేలా ఆరోపణలు చేయడం భావ్యం కాదని పీసీబీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
Tgas : BCCI, PCB, Asia Cup, IPL, Schedule, blockmailing