పేటీఎం నుంచి వెళ్లిపోతున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థలోని పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ బాధ్యతలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థ నుంచి వైదొలగినట్టు సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) అభిషేక్ అరుణ్ సహా ఆఫ్‌లైన్ పేమెంట్స్ సీఓఓ రేణు సతి, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తాలు రాజీనామా చేసినట్టు జాతీయ పత్రిక […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థలోని పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ బాధ్యతలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థ నుంచి వైదొలగినట్టు సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) అభిషేక్ అరుణ్ సహా ఆఫ్‌లైన్ పేమెంట్స్ సీఓఓ రేణు సతి, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తాలు రాజీనామా చేసినట్టు జాతీయ పత్రిక పేర్కొంది.
గడచిన రెండేళ్లుగా సీనియర్ ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగుతుండటం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంస్థలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న అభిషేక్ అరుణ్ కంపెనీకి రాజీనామా చేసినట్టు లింక్‌డిన్ ద్వారా స్పష్టం చేశారు. త్వరలో ఓ స్టార్టప్ కంపెనీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక, 2020లో సంస్థలో చేరిన అభిషేక్ గుప్తా, రేణు సతి కూడా తక్కువ కాలంలోనే సంస్థ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. దీనికి సంబంధించి పేటీఎం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ ఏడాది మొదట్లో పేటీఎంలో చీఫ్ హెచ్ఆర్‌గా పనిచేసిన రోహిత్ ఠాకూర్‌తో పాటు సంస్థ ప్రెసిడెంట్ అమిత్ నాయర్, ముగ్గురు వైస్-ప్రెసిడెంట్‌లు పేటీఎంకు రాజీనామా చేశారు.