లక్షలాది కస్టమర్లతో పేటీఎం మనీ

దిశ, వెబ్‌డెస్క్: నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత అత్యంత వేగంగా ఆదరణ దక్కించుకున్న పేటీఎం (Paytm) సంస్థ ఎప్పటికప్పుడు ఆదరణను పెంచుకుంటోంది. తాజాగా వన్ 97 కమ్యూనికేషన్ నేతృత్వంలోని పేటీఎం మనీ విభాగం అత్యాధునిక సేవలను అందించి 66 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఈ సందర్భంగా స్పందించిన పేటీఎం సీఈవో విజయ్ శేఖర్… మొదటిసారిగా ఇన్‌స్టాల్ (Install) చేసుకున్న వారే 70 శాతం మంది ఉన్నారని, అలాగే 60 శాతం మంది వరకు చిన్న పట్టణాలు, […]

Update: 2020-09-07 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత అత్యంత వేగంగా ఆదరణ దక్కించుకున్న పేటీఎం (Paytm) సంస్థ ఎప్పటికప్పుడు ఆదరణను పెంచుకుంటోంది. తాజాగా వన్ 97 కమ్యూనికేషన్ నేతృత్వంలోని పేటీఎం మనీ విభాగం అత్యాధునిక సేవలను అందించి 66 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఈ సందర్భంగా స్పందించిన పేటీఎం సీఈవో విజయ్ శేఖర్… మొదటిసారిగా ఇన్‌స్టాల్ (Install) చేసుకున్న వారే 70 శాతం మంది ఉన్నారని, అలాగే 60 శాతం మంది వరకు చిన్న పట్టణాలు, నగరాల్లోని వినియోగదారులున్నారని చెప్పారు.

ఇటీవల స్టాక్ బ్రోకరేజ్ (Stock brokerage) రంగంలోకి ప్రవేశించిన పేటీఎం ప్రస్తుతం కేంద్ర పింఛను పథకం, స్టాక్స్‌కు మెరుగైన సేవలను అందిస్తోంది. అలాగే, పేటీఎం మనీ రూ. 20 కోట్ల విలువ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయిస్తోంది. అంతేకాకుండా లక్షలాది ప్రజల సంపదను పెంచేందుకు పేటీఎం మనీ కీలకమైన చర్యలను తీసుకుంటోందని పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ చెప్పారు. అంతేకాకుండా, దేశంలోనే అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ అయిన జెరోధాను పేటీఎం మనీ అధిగమించింది. ప్రస్తుతం జెరోధాకు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో తొలిసారి ఇన్వెస్ట్ చేసినవారు 65 శాతం మంది ఉన్నారు.

Tags:    

Similar News