పేటీఎం ప్రత్యేక నిధి!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ప్రధాని మోదీ ప్రకటించిన పీఎం కేర్స్ నిధికి అనేక సంస్థలు విరాళాలు ఇవ్వగా, ప్రముఖ డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎం కూడా తమ విరాళాన్ని ప్రకటించింది. ఇటీవల పీఎం కేర్స్ నిధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటివరకూ రూ. 100 కోట్లు అందాయని, తమ లక్ష్యం రూ. 500 కోట్ల సేకరణ అని పేటీఎం తెలిపింది. పేటీఎం ఏర్పాటు చేసిన ఈ నిధికి ఎవరైనా […]

Update: 2020-04-11 00:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ప్రధాని మోదీ ప్రకటించిన పీఎం కేర్స్ నిధికి అనేక సంస్థలు విరాళాలు ఇవ్వగా, ప్రముఖ డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎం కూడా తమ విరాళాన్ని ప్రకటించింది. ఇటీవల పీఎం కేర్స్ నిధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటివరకూ రూ. 100 కోట్లు అందాయని, తమ లక్ష్యం రూ. 500 కోట్ల సేకరణ అని పేటీఎం తెలిపింది. పేటీఎం ఏర్పాటు చేసిన ఈ నిధికి ఎవరైనా విరాళమిచ్చేలా ఏర్పాటు చేసింది. పైగా, పేటీఎం ద్వారా వచ్చే ప్రై ఒక విరాళానికి తాము రూ. 10 అదనంగా కలపనున్నట్టు వెల్లడించింది. ఈ ప్రకటనతో పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి స్పందన వచ్చింది. కేవలం పది రోజుల్లో రూ. 100 కోట్ల విరాళం అందినట్టు సంస్థకు చెందిన అమిత్ వెల్లడించారు. ఈ మొత్తంలో తమ సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా తమవంతు విరాళాన్ని ఇచ్చారని, కొందరు మూడు నెలల జీతాన్ని కూడా ఇచ్చినట్టు అమిత్ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని, ఈ మొత్తంతో దేశంలోని ప్రజలను ఆదుకోవడానికి పీఎం కేర్స్‌కు అందజేయడమే కాకుండా, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి ఆకలి తీర్చేందుకు కేవీఎన్ అనే ఫౌండేషన్ భాగస్వామ్యంతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అమిత్ వివరించారు.

Tags: Coronavirus, Coronavirus In India, Coronavirus Doantions, PM-CARES Fund, How To Donate To PM-CARES Fund, PM-CARES Fund Where, Paytm Contribution To PM-CARES Fund, Contribution To PM-CARES Fund

Tags:    

Similar News