నా మెంటల్ హెల్త్ గురించి జడ్జ్ చేయొద్దు : పాయల్
‘ప్రయాణం’ సినిమాలో మంచు మనోజ్‌కు జతగా నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్. ఆ తర్వాత ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. ‘నా మెంటల్ హెల్త్ గురించి ఎవరూ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని’ చెప్తోంది. 2015 నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపిన పాయల్.. తన సమస్యకు మెడిసిన్స్ తీసుకుంటూ, మళ్లీ ఆపేస్తున్నట్టు వెల్లడించింది. మరణం గురించి భయమే తన సమస్య కాగా.. పానిక్ అటాక్స్‌తో భయపడుతోందట. ‘చనిపోతాననే భయం మొదలైనప్పుడు.. కోకిలాబెన్ ఆస్పత్రిలో […]
‘ప్రయాణం’ సినిమాలో మంచు మనోజ్‌కు జతగా నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్. ఆ తర్వాత ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. ‘నా మెంటల్ హెల్త్ గురించి ఎవరూ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని’ చెప్తోంది. 2015 నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపిన పాయల్.. తన సమస్యకు మెడిసిన్స్ తీసుకుంటూ, మళ్లీ ఆపేస్తున్నట్టు వెల్లడించింది. మరణం గురించి భయమే తన సమస్య కాగా.. పానిక్ అటాక్స్‌తో భయపడుతోందట. ‘చనిపోతాననే భయం మొదలైనప్పుడు.. కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్సకు పరుగెత్తాల్సి వస్తోంది. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండటం నిజంగా అదృష్టం’ అని చెప్తోంది.
https://twitter.com/iampayalghosh/status/1272165397010120705?s=19
దీనిపై స్పందించిన అభిమానులు.. ఐదేళ్లు డిప్రెషన్‌లో ఉండటం చాలా డేంజర్ అని.. దాని నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు. ‘ఆర్మీలో పనిచేసే వారు 24 గంటల్లో 24 డిప్రెషన్స్ కలిగి ఉంటారు. కానీ వారు శత్రువును జయించడంపైనే కాన్సంట్రేట్ చేస్తారు. నీవు కూడా నీ భయాన్ని జయించాలి’ అని సూచిస్తున్నారు.