వీడియో పోస్టు చేసి బాధ్యత గుర్తు చేసిన పవన్ కల్యాణ్
కరోనా కష్టాలు వర్ణించనలవి కాదు. అకస్మాత్తుగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఓ నెల క్రితం బిడ్డను ప్రసవించిన ఓ మహిళ ఏకరవు పెట్టింది. కర్నూలు జిల్లాలో పని చేసుకునేందుకు వచ్చానని, లాక్ డౌన్ కారణంగా తన ఇంట్లో వాళ్లు బయటకెళ్లి పనులు చేయలేని పరిస్థితి రావడంతో తినేందుకు తిండి కూడా లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను జనసేనాని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో […]
కరోనా కష్టాలు వర్ణించనలవి కాదు. అకస్మాత్తుగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఓ నెల క్రితం బిడ్డను ప్రసవించిన ఓ మహిళ ఏకరవు పెట్టింది. కర్నూలు జిల్లాలో పని చేసుకునేందుకు వచ్చానని, లాక్ డౌన్ కారణంగా తన ఇంట్లో వాళ్లు బయటకెళ్లి పనులు చేయలేని పరిస్థితి రావడంతో తినేందుకు తిండి కూడా లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను జనసేనాని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఏపీ ప్రభుత్వం, కర్నూలు జిల్లా పార్లమెంటేరియన్స్ దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
Tags: pawan kalyan, twitter, kurnool district, lockdown