మూడు రాజధానులపై పవన్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని తెలిపారు. ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో మూడు రాజధానులపై కాకుండా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలనే అంశంపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ కోరారు. రాజధాని కోసం […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని తెలిపారు. ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో మూడు రాజధానులపై కాకుండా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలనే అంశంపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
రాజధాని కోసం 3వేల ఎకరాలు చాలని టీడీపీ హయాంలో కూడా తాము చెప్పామని, కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా 33వేల ఎకరాలు సేకరించిందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అందుకు మద్దతు తెలిపిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అప్పుడూ, ఇప్పుడూ రైతుల సమస్యల గురించి ప్రశ్నించింది జనసేన మాత్రమేనని పవన్ స్పష్టంచేశారు. రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితి పై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. రైతులకు ఏ విధంగా అండగా ఉండాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు.