విశాఖ స్టీల్ కోసం కదిలిన జనసేనాని..

దిశ, వెబ్‌డెస్క్ : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఏపీలోని ప్రతిపక్ష, విపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ వాసులు సైతం ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం.ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. జగన్ అసమర్ధత వలనే ఆంధ్రుల హక్కుగా పిలువబడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్ర సిద్ధపడిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత […]

Update: 2021-02-10 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఏపీలోని ప్రతిపక్ష, విపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ వాసులు సైతం ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం.ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. జగన్ అసమర్ధత వలనే ఆంధ్రుల హక్కుగా పిలువబడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్ర సిద్ధపడిందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్‌లు ఇద్దరూ బుధవారం కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నష్టాల పరంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం బదులు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందేలా చూడాలని పవన్ కేంద్రమంత్రికి విన్నవించారు.

Tags:    

Similar News