Tirumala:మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం.. భారీ విరాళం అందజేసిన అన్నా లెజినోవా

ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా నేడు(సోమవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Update: 2025-04-14 05:27 GMT
Tirumala:మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం.. భారీ విరాళం అందజేసిన అన్నా లెజినోవా
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా నేడు(సోమవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్(Mark Shanker) ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజుల చికిత్స అనంతరం.. మార్క్ శంకర్‌ను పవన్ కళ్యాణ్, అన్నాలెజినోవా నిన్న హైదరబాద్ తీసుకొచ్చారు.

అనంతరం ఆదివారం సాయంత్రం అన్నా లెజినోవా తిరుమల(Tirumala)కు వెళ్లారు. ఈ తరుణంలో నేడు(సోమవారం) ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని వేకువజామున దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు కోలుకోవడంతో అన్నా లెజినోవా తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద ఇవాళ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నా లెజినోవా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

 

Tags:    

Similar News