ఆదివాసీలతో ‘వకీల్ సాబ్’
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్..రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీ ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ ఒక్క సినిమానే కాకుండా వరుసగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్..అక్కడి ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపారు. విరామ సమయంలో ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలు పాట రూపంలో వారి స్థితిగతుల్ని […]
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్..రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీ ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ ఒక్క సినిమానే కాకుండా వరుసగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్..అక్కడి ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపారు. విరామ సమయంలో ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలు పాట రూపంలో వారి స్థితిగతుల్ని వపన్‌కు వివరించారు.
ఈ వీడియోని స్వయంగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ విరామంలో, అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట..(వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకువచ్చింది)’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA
— Pawan Kalyan (@PawanKalyan) December 24, 2020