సీఎం పదవిపై పవన్ కీలక వ్యాఖ్యలు.. వైసీపీకి ఇదే నా చాలెంజ్

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి పదవిపై పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావాలని ఎన్నడూ ఆలోచించలేదని చెప్పుకొచ్చారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. సీఎం పదవి నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలనని అన్నారు. నటుడిగా మీ అభిమానాన్ని సంపాదించుకున్నానని.. అంతకంటే పెద్ద పదవి లేదని వివరించారు. సీఎం పదవి వచ్చినా.. రాకున్నా తుదిశ్వాస వరకు ప్రజాసేవ చేస్తానని పవన్ […]

Update: 2021-04-03 10:25 GMT
Telangana Formation Day
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి పదవిపై పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావాలని ఎన్నడూ ఆలోచించలేదని చెప్పుకొచ్చారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. సీఎం పదవి నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలనని అన్నారు. నటుడిగా మీ అభిమానాన్ని సంపాదించుకున్నానని.. అంతకంటే పెద్ద పదవి లేదని వివరించారు. సీఎం పదవి వచ్చినా.. రాకున్నా తుదిశ్వాస వరకు ప్రజాసేవ చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు. జీవితంలో దేశభక్తి తప్ప.. తనకు ఏ కోరిక లేదన్నారు. పోరాడి సాధించిన స్వాతంత్ర్యాన్ని కొందరు నేతలు నాశనం చేస్తున్నారన్నారు. ఏపీలో జరుగుతున్న రౌడీ రాజకీయంపై మండిపడిన పవన్.. ఏ గూండాలకైనా ఎంతకాలం భయపడతామని తిరుపతి ప్రజలను ప్రశ్నించారు. పులివెందుల పేరు దుర్మార్గాలకు, దోపిడీకి అడ్రస్‌గా మారిపోయిందన్నారు. ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారని.. మానవ హక్కులు కాలరాసి పోతున్నాయని గుర్తుచేశారు. ఫ్యాక్షన్ గూండాల దాడులకు భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదన్నారు. మర్యాదగా ఉండకపోతే రోడ్లపైకొచ్చి చొక్కాలు పట్టుకుని లాగుతామని హెచ్చరించారు.తిరుపతిని ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని.. మీ ప్రతాపం సామాన్యుల మీద కాదని, దమ్ముంటే తనపై చూపించాలని వైసీపీ నేతలకు పవన్ చాలెంజ్ విసిరారు. అధికార బదలాయింపు తప్పకుండా జరగాలని పవన్ పిలుపునిచ్చారు.

వివేకా హత్యపై పవన్ కామెంట్స్..

వైఎస్ వివేకా హత్యపై జనసేన అధినేత పవన్ స్పందిస్తూ.. ఆ కేసును ఇప్పటివరకు తేల్చలేదన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో సీఎం జగన్‌కు తెలుసునని.. ఈ వ్యాఖ్య స్వయంగా వివేకా కూతురు సునీతా ఢిల్లీలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి ప్రభుత్వం సామాన్యులకు ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు.

వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ వాయిదా..!

Full View

Tags:    

Similar News