అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వీరికే..
దిశ, వెబ్‌డెస్క్: అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి అమెరికా ఆర్థికవేత్తలు పార్ ఆర్.మిల్‌గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్‌లకు లభించింది. వేలం సిద్ధాంతం, కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకు గానూ వీరికి నోబెల్ బహుమతి అందించనున్నట్లు స్వీడిష్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాల్లో వేలం ప్రక్రియలు జరుగుతుంటాయి. ఆర్థికవేత్తలు పాల్ మిల్‌గ్రోమ్, రాబర్ట్ విల్సన్‌లు వేలం సిద్ధాంతాన్ని సరళీకరించడమే కాకుండా, ఈ విధానంలో కొత్త పద్ధతులను కనిపెట్టారని పేర్కొంది. దీంతో విక్రయదారులు, కొనుగోలుదారులే గాక, పన్ను […]
దిశ, వెబ్‌డెస్క్: అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి అమెరికా ఆర్థికవేత్తలు పార్ ఆర్.మిల్‌గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్‌లకు లభించింది. వేలం సిద్ధాంతం, కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకు గానూ వీరికి నోబెల్ బహుమతి అందించనున్నట్లు స్వీడిష్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాల్లో వేలం ప్రక్రియలు జరుగుతుంటాయి. ఆర్థికవేత్తలు పాల్ మిల్‌గ్రోమ్, రాబర్ట్ విల్సన్‌లు వేలం సిద్ధాంతాన్ని సరళీకరించడమే కాకుండా, ఈ విధానంలో కొత్త పద్ధతులను కనిపెట్టారని పేర్కొంది. దీంతో విక్రయదారులు, కొనుగోలుదారులే గాక, పన్ను చెల్లింపుదారులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది.