హాస్పిటల్ బిల్లు కట్టలేదని బెడ్‌కు కట్టేశారు!
భోపాల్: 80 ఏళ్ల ఓ వృద్ధుడు హాస్పిటల్ బిల్లు కట్టలేదని అతన్ని బెడ్‌కు కట్టేసిన వైనం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. రాజ్‌గడ్ జిల్లా షాజాపూర్ సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పేషెంట్ లక్ష్మీ నారాయణ్ చికిత్స పొందేందుకు రూ. 6,000లు డిపాజిట్ చేసి షాజాపూర్ సిటీ హాస్పిటల్‌లో చేరాడు. తర్వాత మరో రూ. 5,000లు కట్టాడు. రికవరీ అయిన తర్వాత ఆ హాస్పిటల్ ఇంకా రూ. 11,270లు చెల్లించాలని అడిగింది. లాక్‌డౌన్‌తో ఉపాధి […]
భోపాల్: 80 ఏళ్ల ఓ వృద్ధుడు హాస్పిటల్ బిల్లు కట్టలేదని అతన్ని బెడ్‌కు కట్టేసిన వైనం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. రాజ్‌గడ్ జిల్లా షాజాపూర్ సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పేషెంట్ లక్ష్మీ నారాయణ్ చికిత్స పొందేందుకు రూ. 6,000లు డిపాజిట్ చేసి షాజాపూర్ సిటీ హాస్పిటల్‌లో చేరాడు. తర్వాత మరో రూ. 5,000లు కట్టాడు. రికవరీ అయిన తర్వాత ఆ హాస్పిటల్ ఇంకా రూ. 11,270లు చెల్లించాలని అడిగింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వృద్ధుడి కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దీంతో నారాయణ్‌ను హాస్పిటల్ బెడ్‌కే కట్టేసి, ఇంటికి తీసుకెళ్లకుండా అతని కూతురిని వారించారు. వృద్ధుడిని బెడ్‌కు కట్టేసిన దృశ్యాలు బయటికి రావడంతో ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, పేషెంట్‌కు మూర్ఛ రోగమున్నదని, తనని తానే గాయపర్చుకోకుండా అడ్డుకునేందుకే బెడ్‌కు కట్టేశామని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది.