జొమాటో ఘటన సిగ్గుచేటు – మహిళను శిక్షించండి : పరిణీతి
దిశ, సినిమా : బెంగళూరు జొమాటో ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. డెలివరీ బాయ్ కామరాజ్ తనపై దాడి చేశాడని ఓ మహిళ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో పాపులర్ అయిన న్యూస్‌తో ముందుగా డెలివరీ బాయ్ తప్పు చేశాడనుకున్నా.. అతని వివరణ విన్నాక మాత్రం నిర్దోషి అనే అభిప్రాయానికి వచ్చారు జనాలు. సోషల్ మీడియాలో నెటిజన్లు తనకు మద్దతిస్తుండగా.. హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా డెలివరీ బాయ్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. […]
దిశ, సినిమా : బెంగళూరు జొమాటో ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. డెలివరీ బాయ్ కామరాజ్ తనపై దాడి చేశాడని ఓ మహిళ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో పాపులర్ అయిన న్యూస్‌తో ముందుగా డెలివరీ బాయ్ తప్పు చేశాడనుకున్నా.. అతని వివరణ విన్నాక మాత్రం నిర్దోషి అనే అభిప్రాయానికి వచ్చారు జనాలు. సోషల్ మీడియాలో నెటిజన్లు తనకు మద్దతిస్తుండగా.. హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా డెలివరీ బాయ్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘జోమాటో ఇండియా – దయచేసి నిజమేంటో కనుగొని పబ్లిక్‌గా రిపోర్ట్ చేయండి. డెలివరీ బాయ్ నిర్దోషి అయితే (అతన్ని నేను నమ్ముతున్నాను), వెంటనే మహిళను శిక్షించేందుకు సాయపడండి. ఇది అమానవీయం, సిగ్గుచేటు మరియు హృదయ విదారకం.. నేను ఎలా సహాయం చేయవచ్చో తెలపండి.. #ZomatoDeliveryGuy’ అంటూ జొమాటోకు రిక్వెస్ట్ పెట్టింది.
Zomato India – PLEASE find and publicly report the truth.. If the gentleman is innocent (and I believe he is), PLEASE help us penalise the woman in question. This is inhuman, shameful and heartbreaking .. Please let me know how I can help.. #ZomatoDeliveryGuy @zomatoin
— Parineeti Chopra (@ParineetiChopra) March 13, 2021